Chandrababu: తెలుగుదేశం పార్ట జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. వర్ల రామయ్య ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. కాగా తొలిసారి 1995 లో చంద్రబాబు పార్టీ పగ్గాలు అందుకున్నారు. 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రెండేళ్లకోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.