
ఆన్ లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డుకు చుక్కెదురైంది. ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ ను రద్దు చేసి గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఆన్ లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, సరైన విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు, ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.