Train Accident: పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని కాచీగూడ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం..మహ్మద్ సాహెబుద్దీన్, ఫైజాన్ సోమవారం యాకుత్ పురా ఉప్పగూడ స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా అటు వైపుగా వచ్చిన రైలు ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సాహెబ్బుద్దీన్ ఎలక్ట్రిక్ పనులు చేగా ఫైజన్ వెల్డింగ్ పని చేసేవాడు.