War 2 collections : నిర్మాత నాగవంశీ(Nagavamsi) గురించి మన అందరికీ తెలిసిందే ఉంటుంది. మంచి ఫైర్ బ్రాండ్,ఆయన మాట్లాడే మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. వివాదాస్పదంగా కూడా మారుతుంటాయి. అయితే కరోనా తర్వాత టాలీవుడ్ లో విజయవంతమైన సినిమాలు తీస్తూ, అత్యధిక సక్సెస్ రేషియో ఉన్న నిర్మాత ఆయనే. దిల్ రాజు వంటి వారు కూడా వరుస ఫ్లాప్స్ తో వెనుకబడ్డారు. అలా వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నాగవంశీ కి, రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. బయ్యర్స్ కి దాదాపుగా 15 రూపాయిల నష్టం వాటిల్లింది. ఇది చిన్న నష్టమే అయినా, నిన్న విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం నాగవంశీ ని చావుదెబ్బ కొట్టింది అనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది.
ఈ టాక్ ప్రభావం ఓపెనింగ్స్ పై చాలా తీవ్రంగా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిల్లర రాలింది అనుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమేరకు పర్వాలేదు అనిపించినా, తెలంగాణ లో మాత్రం దారుణం నుండి అతి దారుణమైన వసూళ్లను రాబట్టింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కోదాడ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాలకు వచ్చే వసూళ్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ 20 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాల కలెక్షన్స్ ని తీసుకొని ‘వార్ 2’ పోల్చి చూస్తున్నారు. నైజాం లో ఈ రేంజ్ లో వసూళ్లను నమోదు చేసుకున్న ఈ సినిమాకు నిర్మాత నాగవంశీ దాదాపుగా 8 కోట్ల గ్రాస్ వచ్చిందని, 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇది నిజంగా అధికారికంగా ప్రముఖ వెబ్ సైట్స్ లో వెయ్యిస్తే నాగ వంశీ కచ్చితంగా చిక్కుల్లో పడినట్టే.
ఎందుకంటే వార్ 2 కి నిర్మాత నాగవంశీ కాదు. యాష్ రాజ్ ఫిలిమ్స్ నుండి తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన ఈ సినిమా హక్కులను 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు టాక్. ఆ 90 కోట్లలో కొంతమేరకు అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు. మిగిలిన డబ్బులు కలెక్షన్స్ నుండి వచ్చే వాటిల్లో ఇవ్వాలి. నాగవంశీ ఇష్టమొచ్చినట్టు కలెక్షన్స్ వేయిస్తే, ఆ డబ్బులు ఇవ్వమని యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ వారు అడుగుతారు. అసలే నష్టాల్లో ఉన్న నాగవంశీ మరో భారీ నష్టాన్ని ఈ రూపం లో ఎదురుకోవాల్సి ఉంటుంది. మరి ఏమి చేయబోతున్నాడో చూడాలి. ఇకపోతే రెండవ రోజు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి,కానీ తెలుగు వెర్షన్ వసూళ్లు మాత్రం అసలు పికప్ అవ్వలేదు. ఫస్ట్ షోస్ తో అయినా పికప్ అవుతుందో లేదో చూడాలి.