
కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకున్న దేశ రాజధానిలో తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడటం కలవరం కలిగిస్తోంది. ఢిల్లీలో 50 మందికి బ్లాక్ ఫంగస్ సోకగా వీరిలో 40 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ రోగుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటంతోనే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని పలువురు వైద్య నిపుణులు హచ్చరిస్తున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న మధుమేహం వ్యాధి ఉన్నవారికి ఎక్కువగా సోకుతుంది. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులను నిరోధించేందకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.