
తెలంగాణ పీసీీసీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అదే మాట్లాడతారని మండిపడ్డారు. ఆయనను పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్నప్పడు టీడీపీని నట్టేటా ముంచేశారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా మునగడం ఖాయమని, అందులో అనుమానమే లేదని పేర్కొన్నారు.