
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్ లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నారు. జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ లీగ్ కు అందుబాటులో ఉండరని ఇంగ్లాండ్ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. అయితే రానున్న టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా జట్ల యాజమాన్యాలు దీనిపై స్పందించాల్సి ఉంది.