Homeఅంతర్జాతీయంAustin Telugu School anniversary : ఘనంగా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవం

Austin Telugu School anniversary : ఘనంగా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవం

Austin Telugu School anniversary : ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తానా పాఠశాల విద్యార్థులు కలిసి ప్రదర్శించిన బాల రామాయణం నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పిల్లలు స్వయంగా తెలుగు భాషలో సంభాషణలు చేస్తూ రామాయణ పాత్రలను ఆవిష్కరించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల అద్భుత నటనకు హాజరైన వారంతా మంత్రముగ్ధులయ్యారు.

ఈ వేడుకలకు గౌరవ అతిథిగా విచ్చేసిన సిటీ మేయర్ జిమ్ గారు విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా విశ్వ గురుకులం “అంకురం” పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యుడు రామ్ మారం గారు విడుదల చేసి, పాఠశాల మరియు విశ్వ గురుకులం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

పాఠశాల పూర్వ విద్యార్థులైన నిహారిక భమిడిపాటి, రితిక గంగబత్తిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ద్విజేష్ గొంట్ల, సమయ సిద్ధాంత పొట్లచెరువు ఈ ఏడాది విద్యార్థులకు బోధించడం విశేషంగా ప్రశంసలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో పాఠశాల కో-చైర్ రజని మారం గారు, ఉపాధ్యాయులు అనూష చిట్టూరి, ప్రతూష అట్లూరి, శ్వేత వెలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, మృదుల కొనంకి, వాసవి కల్వతో పాటు విశ్వ గురుకులం ఉపాధ్యాయులు వంశీ భరద్వాజ్ గారిని తానా చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ గారు, తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారు అభినందించారు.

అలాగే కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన శ్రీనివాస్ లావు, శ్రీనివాస్ ఒరుగంటి, రాజా కసుకుర్తి, ఠాగూర్ మల్లినేని గారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version