
మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టాన్ని సత్వరమే ఆమోదించాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి జగన్ లేఖ రాశారు. దిశ బిల్లు ఆమోదం వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దిశ ప్రాజెక్టుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన సీఎం కేంద్ర మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు.