AP Mega DSC Schedule: ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.