
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అరెస్టుపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మరికాసేపట్లో విచారణ జరుపనుంది. రఘురామ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం పై ఆయన తరపు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ పూర్తయ్యేంత వరకు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని సీఐడీ అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల కస్టడీలో ఉన్న రఘురాముకు ఆహారం, వైద్యం, వసతికి వెసులు బాటు కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారని ఆయన పై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు.