
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వెయ్యి మందికిపైగా పదోన్నతులు లభించనున్నాయి. అధికారుల స్థాయిలో తక్కువగా ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువగా ప్రమోషన్లు దక్కనున్నాయి. ఈ ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పంచనుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.