గోవాలో ఆక్సిజన్ కొరతతో మరో 13 మంది మృతి

గోవా మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో శుక్రవారం మరో 13 మంది రోగులు మరణించారు. గురువారం 15 మంది, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది రోగులు చనిపోయారు. దీంతో ఈ ఆసుపత్రిలో వరుసగా నాలుగు రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన కరోనా రోగుల సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యంపై  పలువురు కోర్టుకు ఆశ్రయించారు. మరోవైపు బాంబే హైకోర్టు బెంచ్ ఈ పిటిషన్లపై గత నాలుగు […]

Written By: Suresh, Updated On : May 14, 2021 2:47 pm
Follow us on

గోవా మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో శుక్రవారం మరో 13 మంది రోగులు మరణించారు. గురువారం 15 మంది, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది రోగులు చనిపోయారు. దీంతో ఈ ఆసుపత్రిలో వరుసగా నాలుగు రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన కరోనా రోగుల సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యంపై  పలువురు కోర్టుకు ఆశ్రయించారు. మరోవైపు బాంబే హైకోర్టు బెంచ్ ఈ పిటిషన్లపై గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నది. కాగా శుక్రవారం ఆక్సిజన్ కొరత వల్ల ఈ ఆసుపత్రిలో 13 మంది రోగులు మరణించినట్లు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.