యాంకర్ ప్రదీప్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుూనే ఉంటాడు. తాజాగా ఓ షోలో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ రాజధాని విశాక అంటూ ఓ టీవీ షోలో ఆయన వ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్ లో యాంకర్ ప్రదీప్ ఇంటిన ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు. కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు.