
అఫ్గానిస్తాన్ లోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 26న గురువారం ఈ సమావేవం జరగనుంది. అఫ్గాన్ లోని పరిస్థితులను, భారత్ అనుసరించాల్సిన వైఖరి గురించి చర్చించే అవకాశం ఉంది. అంతకుముందు అఫ్గాన్ పరిణామాలపై రాజకీయ పార్టీలకు వివరించాలని ప్రధాని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.