
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో మహిళపై గోపీ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. మహిళ కట్టా వెంకయమ్మ (38) పై బాత్రూంల శుభ్రపరిచే యాసిడ్ తో గోపీ దాడి చేశాడు. శరీరమంతా మంటలు రావడంతో మైలవరం ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. మహిళకు భర్త లేకపోవడంతో గోపీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో వెంకాయమ్మపై గోపీ యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.