
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి ని నియమించనున్నారా..? ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి కళా వెంకట్రావు తప్పుకోనున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అంతేకాకుండా ఈనెల 27న అధికారికంగా కూడా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బీసీ నేతకే పార్టీ పగ్గాలు ఇచ్చిన చంద్రబాబు మళ్లీ బీసీకే పట్టం కట్టనున్నట్లు చూస్తున్నారు. కొంత కాలంగా రాష్ట్ర కమిటీపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం టీడీపీ గళాన్ని వినిపిస్తున్న అచ్చెన్నాయుడుకు పార్టీ పగ్గాలు ఇవ్వనున్నారు. గత కొంత కాలంగా పలు కేసుల్లో జైలుకు వెళ్లిన అచ్చెంనాయుడు తనను అక్రమంగా ఇరికిస్తున్నారని వాదిస్తున్నారు. సుమారు 70 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఆయన అధ్యక్ష హోదాలో ఎలాంటి పోరు నడిపిస్తాడో చూడాలి.
Also Read: వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?