
రాష్ట్రంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ లో తెలిపింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా 6,361 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722పెరిగింది. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు.