
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతోపాటు, కార్పొరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే విధులకు హాజరవుతున్నారు. జూన్ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.