
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది చనిపోయినట్లు పేర్కొంది. నిన్న 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 65 వేలు దాటింది. ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.