
దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34, 703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 111 రోజుల తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. రోజువారీ కేసుల కంటే ఎక్కువ మంది బాధితులు కోలుకుంటుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 4.64 లక్షలకు తగ్గి 101 రోజులక కనిష్టానికి చేరుకున్నాయని చెప్పింది. తాజాగా వైరస్ నుంచి 51,864 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పింది.