
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. మొన్నటి దాకా నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా నిన్న 3.60 లక్షల వరకు తగ్గగా తాజాగా 3.30 లక్షలకు దిగువన కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3.29.942 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ మగళవారం తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 కు పెరిగింది. కొత్తగా 3,56,082 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. మరో 3,876 మంది మరణించారు.