
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకు పైగా కేసులు నమోదవగా, తాజాగా అవి .26 లక్షలకు తగ్గాయి. అయితే మరణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మరణించారు. దీంతో మొత్త కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 3,53,299 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.