
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 పరీక్షలు నిర్వహించగా 14, 792 కేసులు నిర్ధారణ కాగా 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 10, 84, 336 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,03.866 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.