12 year old girl assault case : మన ఇంట్లో ఆడపిల్లలకు ఏదైనా జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం.. చిన్నపాటి జ్వరం వస్తేనే ఇబ్బంది పడిపోతుంటాం కదా.. అటువంటిది ఒక 12 సంవత్సరాల బాలిక మీద ఓ 45 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తి మూర్ఖుడిలాగా.. మృగంలాగా మీద పడిపోయి దాడి చేస్తే.. పైగా భవనం నుంచి కింద పడేస్తే.. మనకు ఎలా ఉంటుంది.. మన ఇంట్లో ఆడపిల్ల పై అలా జరిగితే మనం ఎలా స్పందిస్తాం..
చదువుతుంటేనే రక్తం ఉడికిపోతుంది కదూ. కానీ భారత రాష్ట్ర సమితి నాయకులకు మాత్రం అలా ఉడికిపోలేదు. పైగా 12 సంవత్సరాల బాలిక మీద తమ పార్టీ నాయకుడు దారుణం చేస్తే వెనకేసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ బాలిక శీలానికి వెలకట్టే ప్రయత్నం చేశారు. చివరికి మూడు లక్షల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడడంతో ఆ గులాబీ పార్టీ నాయకుడి ఆగడాలు చెల్లలేదు. అక్కడి పోలీసు అధికారులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఉదయం లేస్తే నీతులు చెప్పే కేటీఆర్.. ఈ వ్యవహారం గురించి ఇంతవరకు మాట్లాడలేదు. హరీష్ రావు నిమ్స్ లో ఆ బాలికను పరామర్శించి.. జరిగిందంట్లో తమ పార్టీ నాయకుడి తప్పులేదు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత లేదని నిందను ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. అక్కడ బాలిక మీద దాడి చేసింది గులాబీ పార్టీ నాయకుడు. పైగా అతని మీద రౌడీషీట్ ఉంది. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం అతిపెద్ద తప్పు. పైగా అతడు ఆ బాలిక మీద అంతటి దారుణానికి పాల్పడితే కనీసం అతడిని ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. పైగా ప్రభుత్వం మీద నింద వేయడం గులాబీ పార్టీ నాయకులకు చెల్లింది.
ఆ బాలిక వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మంత్రులు ఆ బాలికను పరామర్శించారు. ఎంతటి ఖర్చైనా సరే వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఎక్కడ ప్రజల నుంచి తమ మీద నిరసన వ్యక్తమౌతుందోనని తెలిసి గులాబీ పార్టీ నాయకులు భలే తెలివిగా కవర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంటే.. ముందుగా సెటిల్మెంట్ కు ప్రయత్నించిన నాయకుల మీద ఖచ్చితంగా కేసులు నమోదు అవుతాయి. అంతేకాదు, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

