
కరోనా నగరంలో విలయతాండవం చేస్తోంది. గాంథీ టిమ్స్ ఆస్పత్రుల్లో ఒక్కరోజు వ్యవధిలోనే 115 మంది చనిపోయారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు గాంధీ ఆస్పత్రిలో 75 మంది, గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో 40 మంది కారోనాతో చినిపోయారు. గాంధీలో గడిచిన మూడు రోజుల్లో 205 మంది చనిపోయారు. రోజూ సుమారు 40 నుంచి 75 మంది వరకు ప్రాణాలు కోల్సోతున్నట్లు సమాచారం.