
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు నడుం బిగించారు. ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు రూ. 2 కోట్ల రూపాయలతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం మొదలు పెట్టారు. ఇన్ దిస్ టుగెదర్ పేరుతో ఫండ్ రైజింగ్ మొదలు పెట్టిన వీరు వారం రోజులలోొ రూ. 7 కోట్ల ఫండ్ ని సేకరించాలనే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ ఐదు రోజుల్లోనే 7 కోట్లు రావడంతో టార్గెట్ ని రూ. 11 కోట్లకి విరుష్క జోడీ పెంచింది. వారం రోజులు ముగిసే సమయానికి ఇన్ దిస్ టుగెదర్ కి రూ.11,39,11,820 ఫండ్ వచ్చినట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు.