
రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరించిన ఆమె సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ సంక్షేమ పథకాలు గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు. సంక్షేమం, స్వయంసంవృద్ధి, సమానత్వం వంటి అంశాలే ముఖ్య అజెండా అని షర్మిల చెప్పారు.