
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకొని కేసీఆర్ రాజకీయ లబ్ధి పొందుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రాహుల్ గాంధీతో దళిత దండోరాపై చర్చించామన్నారు. దళిత దండోరా కార్యక్రమానికి రాహుల్ గాంధీ రాబోతున్నారని తెలిపారు.