
కడప జిల్లాలోని వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. మఠానికి ప్రత్యేక అధికారి ఏర్పాటు పై ప్రశ్నించిన న్యాయస్థానం ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారో చెప్పాలని దేవాదాయశాఖను ఆదేశించింది. వాదానలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.