
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల వ్యవహారంతో జూన్ నెల మొత్తం వాడీవేడీగా గడిచిపోయింది. ఈ ఏడాది మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానల్ ని సిద్ధం చేసుకున్న ప్రకాశ్ రాజ్ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల ఎన్నికలు ఎప్పుడు అంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై తాజాగా నరేష్ స్పందించారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి మా సమాధానమిదే అంటూ సెటైర్ వేశారు. నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లోకి దూకానా? అని అడిగినట్లు ఉంది అంటూ నరేష్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు.