బంగారం, వెండి ధరలు నేడు మరోసారి పడిపోయాయి. ఎంసిఎక్స్ అక్టోబరు బంగారు ప్యూచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర 1.2శాతం తగ్గి, రూ.49,764కు చేరుకోగా , వెండి ప్యూచర్స్ 4 శాతం పడిపోయి కోలో వెండి ధర రూ.58,851 చేరుకుంది. అంతకుముందు బంగారం ధర సోమవారం 1,200 తగ్గింది. మంగళవారం వెండి ధరలు కూడా తగ్గటంతో రూ.6,000 దిగోచ్చింది.గత నెలలో బంగారం ధర అత్యధికంగా రూ.56,200 తాకీ , ఇప్పుడు భారతదేశంలో బంగారం 10 గ్రాములకి 6 వేలు తగ్గింది.