- Telugu News » Latest News » %e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d %e0%b0%9c%e0%b0%a8%e0%b0%82 %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 %e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a
వైఎస్ఆర్ జనం కోసం జీవించారు.. విజయమ్మ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ శత్రువులైనా, ప్రత్యేర్థులైనా వైఎస్ఆర్ ను అభిమానించారు. నాయకుడంటే వైఎస్ఆర్ లా ఉండాలి. ఆయన మరణంలేని నాయకుడు. తెలంగాణలో వైఎస్ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు అని అన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం షర్మిల మీ మందుకు వస్తోంది. మీ కుటుంబ సభ్యురాలిగా […]
Written By:
, Updated On : July 8, 2021 / 06:22 PM IST

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి విజయమ్మ, షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ శత్రువులైనా, ప్రత్యేర్థులైనా వైఎస్ఆర్ ను అభిమానించారు. నాయకుడంటే వైఎస్ఆర్ లా ఉండాలి. ఆయన మరణంలేని నాయకుడు. తెలంగాణలో వైఎస్ కోసం ప్రాణాలు విడిచిన వారు ఉన్నారు అని అన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం షర్మిల మీ మందుకు వస్తోంది. మీ కుటుంబ సభ్యురాలిగా అక్కున చేర్చుకోండి అని విజయమ్మ అన్నారు.