’ఫైజర్‘ వినియోగానికి అనుమతులు జారీ..

కరోనా నిరోధానికి అనేక దేశాలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అందరికంటే ముందు వరుసలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసింది. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉండి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫార్సు చేసింది. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేసన్స్, వ్యాక్సిన్ అండ్ రిలేటెడ్ […]

Written By: Suresh, Updated On : December 12, 2020 7:28 am
Follow us on

కరోనా నిరోధానికి అనేక దేశాలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అందరికంటే ముందు వరుసలో అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసింది. ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉండి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫార్సు చేసింది. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేసన్స్, వ్యాక్సిన్ అండ్ రిలేటెడ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అడ్వయిజరీ కమిటీ అనుమతులు జారీ చేసింది. దీంతో వచ్చేవారం నుంచి అమెరికాలో వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉంది. భారత్ లోనూ ఫైజర్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తుకుంది. ఇక్కడ అనుమతుల కోసం వేచి చూస్తోంది. అనుమతులు రాగానే ఇండియాలోనూ ఫైజర్ వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉంది.