
మద్యాన్ని రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా చడమని, దశల వారీగా పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మద్యం మానేందుకే మద్యం ధరలు పెంచుతున్నామని చెబుతూ ఈ ఏడాది కాలంలో రెండు దఫాలుగా మద్యం ధరలు భారీగా పెంచి ప్రజల నుంచి రూ. వేల కోట్లు ఖాజానాలో వేసుకునే యత్నం చేస్తోంది.
తాజాగా రూ.5 వేల కోట్లు బాదుడుకు రంగం సిద్ధం చేశారు. రూ.120 లోపు క్వార్టర్ బాటిల్ పై రూ.20, ఆఫ్ బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80 ధర పెంచారు. మినీ బీరు పై రూ.20, పెద్ద బీరుపై రూ.30 పెంచారు. రాష్ట్రంలో గతేడాది జరిగిన మద్యం అమ్మకాల విలువకు 25 శాతం ఆదాయం కూడా కలిపితే కొత్తగా రూ.4,406 కోట్లు వస్తుంది. దానికి ఏటా వచ్చే సాధారణ వృద్ధిని కలిపితే దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
ధర పెరిగినా షాపుల వద్ద రద్దీ తగ్గదు క్షణాల్లో సరుకు ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి షాపుల ముందు జనం క్యూలో నిలుచుని ఎదురు చూస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఒక్కసారిగా షాపుల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు, కొనుగోళ్లపై ప్రజల్ని నిరుత్సాహపరిచి మద్య నిషేధం దిశగా అడుగులు వేసేందుకు ధరల పెంపే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రజారోగ్యం, నిషేధం వంటివి సాకు మాత్రమేనని కరోనా కష్టకాలంలో ఖజానాను నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదాయం లేక విలవిల్లాడుతున్న ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మద్యం ఒక్కటే కనిపిస్తోంది.
చిరంజీవిని మెగాస్టార్ అనలేం అన్న జె డి చక్రవర్తి
అయితే ప్రస్తుతం పెంచిన ధరకు కొత్త పెరు పెట్టింది. దీన్ని ధర రూపంలో కాకుండా ప్రొహిబిషన్ పన్ను పేరు తో కొత్త కాంపోనెంట్ సృష్టించి వసూలు చేయనున్నారు.
నిజంగా దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే పోలీసులను పెట్టి అమ్మకాలు జరపొచ్చు. మద్య నిషేధమే లక్ష్యమైతే లాక్‌డౌన్‌తో వచ్చిన అవకాశంతో షాపులను పూర్తిగా బంద్ చేయవచ్చు. హడావిడిగా ధరలు పెంచి షాపులు తెరవాల్సిన అవసరం ఏమిటని పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విధానం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందనేది స్పష్టమవుతుంది. ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పింది వట్టిమాటలే అనే విషయం బట్టబయలు అయ్యింది.