
ఇటీవల ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో కేంద్రంహోమంత్రి అమిత్ షాను రెండు రోజులు కలిశారు. ఈ భేటీపై కామన్‌గా ‘ఎల్లో మీడియా’ తన అక్కసు వెల్లగక్కింది. ఎల్లో మీడియాలో ఓ భాగస్వామి అయిన ఆంధ్రజ్యోతి మాత్రం తన తిక్కను మరోసారి ప్రదర్శించింది. లైవ్‌లో ఉండి అన్ని విన్నట్లుగా ఏవేవో వార్తలు వడ్డించింది. మరి ఇప్పుడు జగన్ మోడీతో భేటీ కానున్నారు. మరి ఇప్పుడెన్ని అక్కసు రాతలు రాస్తారనేది అసక్తికరంగా మారింది. ఈ రాతలు అందరికీ ఎలా ఉన్నా.. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం ఆనందంగా కనిపిస్తున్నాయి. కానీ.. అక్కడ జరుగుతున్న రాజకీయం వేరేనని గ్రహించలేకపోతున్నారు.
Also Read: ఎన్నికలేవైనా పీకే ఉండాల్సిందేనా.?
దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ.. అందులోభాగంగానే సీఎం జగన్‌ను మిత్రుడిలా భావిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల బుద్ధి ఏపాటిదో.. జగన్ వ్యక్తిత్వం ఏంటో ఇప్పటికే మోడీ కూడా అర్థమైపోయింది. ఆ ఇద్దరిదీ అందితే జుట్టు.. లేదంటే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించేస్తున్నారనేది మోడీ భావిస్తున్నారు. జగన్‌లో మాత్రం హూందాతనం కనిపిస్తోంది. వీరిద్దరితో పోల్చుకుంటే జగన్ బెటర్ నిర్ధారణకు వచ్చారట. అందుకే… జగన్‌పై కేంద్ర ప్రభుత్వం పెద్దలకూ సదాభిప్రాయం వచ్చిందట.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్‌లో చేరుతున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఇక పచ్చ పార్టీ, పచ్చ మీడియా పాచికలు పారవనేది స్పష్టం. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఎన్డీయేతో జట్టుకడితే బహుశా చంద్రబాబు నాయుడుకు కూడా అంత కన్నా షాకింగ్ విషయం ఉండకపోవచ్చు. ఇప్పటి వరకు బీజేపీ బాబు జతకట్టారు. బీజేపీ తమకు మిత్రపక్షమే అంటూ చెప్పుకునే చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీకి జగన్ దగ్గర అవుతుండడంతో తట్టుకోలేకపోతోంది. అటు ‘పచ్చ’ మీడియా కూడా తనదైన రీతిలో స్పందిస్తోంది.
Also Read: గన్నవరంలో సెగలు.. వంశీ వర్సెస్ దుట్టా?
ఇప్పటికే బీజేపీని దూరం చేసుకొని.. మళ్లీ దగ్గర కావాలని చంద్రబాబు ఎప్పటినుంచో కుయుక్తులు పన్నుతున్నారు. అయితే.. జగన్ పార్టీని మోడీ, అమిత్ షాలు దగ్గరకు తీస్తే టీడీపీ వర్గాల గొంతులో పచ్చి వెలగకాయ పడినట్టే. ఎన్డీయేలకు చేరే పక్షంలో జగన్ షరతులు ఉండనే ఉంటాయి. వాటి ప్రకారం చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతాలపై సీబీఐ విచారణ తప్పనిసరిగా ఉంటుందనేది టాక్. ఎన్డీయేలో చేరి చంద్రబాబు మీద ఎలాంటి చర్యలకు దిగుతారో అందరికీ ఆసక్తి ఉంది.