YS Sharmila Arrested: ధర్నా ఉందని అడ్డ మీద నుంచి కూలీలను తీసుకొచ్చి వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన నిర్వహించారు. మంగళవారం ఉదయం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ధర్నా ఉందని కూలీను మనిషికి రూ.400 కూలీ ఇస్తామని తీసుకొచ్చి తరువాత ముఖం చాటేశారు. దీంతో వారు ఆందోళన చేశారు. దీక్షా స్థలి నుంచే నిరసన తెలిపారు. దీంతో వైఎస్సార్ టీపీ అప్రదిష్ట మూటగట్టుకుంది. కూలీల గొడవతో విషయం కాస్త పెద్దదయింది. అయితే పోలీసులు సైతం నిరసన దీక్షకు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
అక్టోబర్ 20 నుంచి ప్రజా ప్రస్తానం పేరుతో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు పాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించారు. రోజుకు 12 నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తన తండ్రి ఆశయ సాధనలో భాగంగానే రాజన్న రాజ్యం తెచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ మినహా 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర ఉండేలా చర్యలు తీసుకుంటున్నారరు.
నిరుద్యోగ సమస్యపై ఇప్పటికే షర్మిల నిరసన దీక్షలు చేపడుతున్నారు. తెలంగాణ పాదయాత్రకు వైఎస్సార్ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తమ ఆశయాల సాధనకు పాటుపడడం లేదని చెబుతున్నారు. పాదయాత్రతో పార్టీల్లో కనువిప్పు కలగాలని సూచించారు. దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించారు.
తన తండ్రికి కలిసొచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర ఏడాది కాలం పాటు సాగుతుందని తెలుస్తోంది. పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా చూస్తున్నట్లు చెబుతున్నారు. పాదయాత్రలో ఎలాంటి బ్రేకులు లేకుండా సాగనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.