Homeజాతీయ వార్తలుAam Aadmi Party: మీ సీఎం మీ చేతుల్లోనే.. ఆమ్ ఆద్మీ విజయరహస్యం ఇదే

Aam Aadmi Party: మీ సీఎం మీ చేతుల్లోనే.. ఆమ్ ఆద్మీ విజయరహస్యం ఇదే

Aam Aadmi Party: నాయకుడంటే నడిపించాడు వాడు అయ్యిండాలి.. జనాల మెప్పు పొంది ఉండాలి. ఎవరిని పడితే వారిని సీఎం చేస్తే జనాలు ఆమోదించారు. ఆ పార్టీని ఓడిస్తారు. చరిత్రలో చూస్తే ప్రజల్లోంచి వచ్చిన వారు విజేతలయ్యారు. ప్రజల నాడి తెలుసుకున్న వారే చిరస్థాయిగా నిలిచారు. ఒక మోడీ, కేసీఆర్, జగన్ ఇలా ప్రజల మెప్పు పొంది సీఎంలుగా, పీఎంగా అయ్యారు. అందుకే ప్రజలు సూచించిన వారే సీఎంగా ఉండాలని.. బీజేపీ తరహాలో ఎవరినో ఒకరిని రాష్ట్రానికి సీఎం చేయకూడదని కేజ్రీవాల్ డిసైడ్ అయ్యాడు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ తరుఫున సీఎం అభ్యర్థి ప్రజలే డిసైడ్ చేయాలని కోరాడు. నిజానికి పంజాబ్ లోనూ ఇదే చేసి గెలిచాడు. ఇప్పుడు గుజరాత్ లోనూ అదే చేస్తున్నాడు. మనమే ఎవరినో ఒకరిని నామినేట్ చేసేకంటే ప్రజలకే ఆ చాయిస్ ఇవ్వడం నిజంగా రాజకీయాల్లో ఒక తెలివైన ఎత్తుగడ.. అది చేశాడు కాబట్టే కేజ్రీవాల్ ఇప్పుడు మోడీ తర్వాత అంతటి నేత అవుతున్నాడు. ఈచిన్న లాజిక్ కేజ్రీవాల్ ను దేశవ్యాప్త హీరోను చేస్తోంది. అసలు సిసలు నాయకులను ఆమ్ ఆద్మీ పార్టీకి తయారు చేసి ఇస్తోంది.

Aam Aadmi Party
Aam Aadmi Party

దేశ రాజధాని ఢిల్లీలో ఆవిర్భవించిన పార్టీ ఆమ్‌ ఆద్మీ. నిజాయతీ పాల, ప్రజసేవ లక్ష్యంగా పార్టీకి పునాది వేశారు అరవింద్‌ కేజ్రీవాల్‌. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చారు కేజ్రీవాల్‌. అయితే నాడు సంకీర్ణ ప్రభుత్వం కొద్ది రోజలకే కూలిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఓటర్లు సంపూర్ణ మెజారిటీతో పట్టం కట్టారు. కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరంగా ఉంటూ, కేంద్రంతో కొట్లాడుతూ ఢిల్లీ వాసులకు సుపరిపాలన అందిస్తున్నారు కేజ్రీవాల్‌.

పంజాబ్‌లో పాగా..
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ… ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లోనూ పాగా వేసింది. అక్కడి కాంగ్రెస్‌లో నెలకొన్న అస్థిరత, పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పోరాడారు. ఢిల్లీ పాలనను, ప్రభుత్వ పథకాలను పంజాబ్‌ ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆప్‌వైపు తిప్పుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే జాతీయ పార్టీలతోపాటు స్థానిక అకాళీదల్‌ పార్టీకి భిన్నంగా వ్యూహాలు రచించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థి ఎవరు కావాలో మీచే చెప్పండి అంటూ ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. ఇందుకోసం వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చారు. మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థినే సీఎంను చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడి ఓటర్లు ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించడంతో వారు సూచించిన భగవంత్‌ మాన్‌నే సీఎం చేశారు అరవింద్‌.

గుజరాత్‌లో పాగా వేయాలని..
త్వరలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే బీజేపీని దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారు అరవింద్‌ కేజ్రీవాల్‌. అక్కడి ఓటర్లను ఆప్‌వైపు తిప్పుకునేందుకు దాదాపు ఏడాదిగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఉచిత విద్యుత్, విద్య, వైద్యం హామీలు ఇస్తున్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జోరుమీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. గుజరాత్‌లోనూ పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పంజాబ్‌లో అమలు చేసిన వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు అరవింద్‌.

Aam Aadmi Party
Arvind Kejriwal

పంజాబ్‌ తరహా వ్యూహం..
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం తాజాగా ఆప్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం అభ్యర్థిని ఎంచుకోవడం కోసం ఓటింగ్‌ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా పాల్గొన్నారు. ‘‘గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఆమ్‌ ఆద్మీ పార్టీనే. అందుకే తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో మీరే చెప్పాలని మేం కోరుకుంటున్నాం. ఇందుకోసం మేం మొబైల్‌ నంబరు, ఇ–మెయిల్‌ ఐడీని అందుబాటులోకి తీసుకొచ్చాం. 6357000360 నంబరుకు ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ లేదా వాయిస్‌ మెసేజ్‌ పంపించి ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలి. లేదా aapnocm@gmail.com కు మెయిల్‌ చేయండి. నవంబరు 3వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పొచ్చు. నవంబరు 4న పలితాలను ప్రకటిస్తాం’’ అని సూరత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రజల ఓటు ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని గుర్తించేందుకు ఈ పద్ధతిని ఉపయోగించింది. ఇందుకోసం ఓ వాట్సప్‌ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. కాగా.. ఆ కార్యక్రమానికి పంజాబ్‌ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 21.59 లక్షల స్పందనలు వచ్చినట్లు ఆ పార్టీ వెల్లడించింది. అందులో 93.3 శాతం మంది భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంచుకోవడంతో ఆయన పేరును పార్టీ ఖరారు చేసింది. తాజాగా గుజరాత్‌లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఈసీ ఇంకా షెడ్యూల్‌ ఖరారు చేయనప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular