Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర నేపథ్యంలో సీఎం జగన్ బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంలో ఆంతర్యం వేరే ఉందని తెలుస్తోంది. క్రిమినల్ బ్రెయిన్ తో తన తెలివి తేటల్ని ఉపయోగించుకుని జగన్ ప్రజలను తప్పు దారి పట్టించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ ప్రకటించి తరువాత మళ్లీ దాని అమలుకు వెనక నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మూడు రాజధానుల వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతోనే ముందుగా దీన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టును మోసం చేయడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. మూడు రాజధానులపై న్యాయపరంగా నిలబడకుండా చేసేందుకు చట్టాల్ని కొట్టేసేందుకు కోర్టుకు దారి చూపుతోంది. ఫలితంగా అవి బిల్లు రద్దు చేసినందున దానిపై పట్టించుకునే అవకాశం ఉండదు. ఇదే సమయంలో బిల్లును మరో కోణంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించి తమ పంతం నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఇందులో భాగంగానే జగన్ ఇప్పటికే మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్న క్రమంలో ఆయనలోని ఆంతర్యం ఇదేననే వాదన వినిపిస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాకుండా ఉండేందుకు జగన్ మాయోపాయాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బిల్లుల ఉపసంహరణ నిర్ణయాన్ని ముందుగా కోర్టుకు తెలిపి తరువాత తతంగాన్ని నడిపించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.
Also Read: 3 Capitals: జీతాలకే డబ్బుల్లేని జగన్ కు మూడు రాజధానులా?
మూడు రాజధానుల విషయాన్ని వాడుకుని వైసీపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిల్లులతో కూడా రాజకీయం చేయాలని చూస్తున్నట్లు సమాచారం. దీని కోసం బిల్లుల వివాదం ఎన్నికల వరకు కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. ఏదేమైనా మూడు రాజధానుల వ్యవహారాన్ని అధికార పార్టీ తన ప్రయోజనాల కోసం వాడుకోనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: AP Assembly: జగన్ పీచేముడ్.. బలమొచ్చింది.. ‘‘మండలి రద్దు’’ రద్దైంది!