Janasena vs YCP : భీమవరం.. జనసేనాని పవన్ కళ్యాన్ ఏరికోరి మరీ పోటీచేసిన నియోజకవర్గం.. గాజువాకతోపాటు కాపులు ఎక్కువగా ఉన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీచేశారు. అయితే ప్రజారాజ్యంను ఎలాగైతే కుట్రలు కుతంత్రాలతో నీరుగార్చారో అలానే పవన్ ను ఓడించడానికి 2019లో కుట్ర జరిగింది. పవన్ పోటీచేసిన రెండు చోట్ల 200 కోట్ల చొప్పున కుమ్మరించి ప్రత్యర్థులను గెలిపించారు. బాగా డబ్బున్న వారినే ప్రత్యర్థులుగా నిలబెట్టి పవన్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పటికీ పవన్ ఇదే విషయం చెబుతుంటారు.
పవన్ ను ఓడించేందుకు ఒక్కో నియోజకవర్గంలో 200 కోట్లు ఖర్చు పెట్టిన ఉదంతంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా కీలక సూత్రధారి. వైసీపీ అండదండలతో ఇతడు అరాచకకాండ సృష్టించాడు. నాడు ఓట్ల కంటే కూడా ఎక్కువ పోలయ్యాయి. అంటే రిగ్గింగ్ సహా ఎన్నో అక్రమాలకు పాల్పడి పవన్ ను ఓడించాడు.
అప్పటి నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పై కుట్రలు, కుంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సాగుతున్నాయి. పవన్ పోటీచేసిన భీమవరంలో జనసైనికులు యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా గోదావరి జిల్లాలో పవన్ ‘వారాహి యాత్ర’ సందర్భంగా పర్యటిస్తున్న వేళ భీమవరంలోనూ జనసైనికులు ర్యాలీ తీశారు. ఈ శాంతి యుత ర్యాలీని సహించని వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రెచ్చిపోయారు.
తాజాగా భీమవరం లో ర్యాలీ చేస్తున్న జనసైనికులపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అనుచరులు 8 మంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడికి కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే పీఏ శివనే సూత్రధారిగా ఉన్నారు. ఆయనే దగ్గరుండి మరీ జనసైనికుల తలలు పగుల కొట్టించినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ కు హైప్ రావద్దని.. మళ్లీ భీమవరంలో పవన్ పోటీచేయవద్దు.. ఇటు వైపు చూడవద్దనే పగ ప్రతీకారాలతోనే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి వెనుకుండి మరీ ఇలా జనసైనికులను తొక్కేసే కుట్రకు పాల్పడ్డారని జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై పూర్తి నిజనిజాలు వెలుగు చూడాల్సి ఉంది.