High Court Chief Justice: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరు గతంలో చాలా సార్లు కలిశారు. కానీ ఈసారి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. జగన్ మదిలో ఏముందో ఏం చర్చించారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. జగన్ న్యాయమూర్తితో ఏం మాట్లాడారు. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనేదానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది.

వీరిద్దరు పలు సందర్భాల్లో కలుసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడ వచ్చినప్పుడు కలుసుకున్నా అప్పుడు ఇలా ఏకాంతంగా చర్చలు జరపలేదు దీంతో అప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానాలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం వారు ప్రత్యేకంగా సమావేశం కావడమే సంచలనంగా మారింది. న్యాయపరమైన అంశాలపైనే సుదీర్ఘంగా చర్చలు సాగినట్లు చెబుతున్నా ఇంకా ఏదో ఉంటుందని అందరిలో సందేహాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉండటంతో దీనిపైనే చర్చించారా? లేక ఇంకా ఏవైనా ఉన్నాయా? అయితే హైకోర్టు మాత్రం కర్నూలులో ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరి మధ్య ప్రధానంగా సంభాషణలు చోటుచేరసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి న్యాయపరమైన చిక్కులతోనే ముడిపడి ఉన్నట్లు మాత్రం అందరికి స్పష్టమవుతోంది. దీంతో మూడు రాజధానుల విషయంలోనే ఇద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం.
మూడు రాజధానుల విషయంలో కేంద్రం ఇప్పటికే తన నిర్ణయం ప్రకటించినందున ఇక రాష్ట్రానిదే తది నిర్ణయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య చర్చలు జరగడంతో ఈ విషయంలో ఏదైనా ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారో ఏమో తెలియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కోర్టు భవనాల నిర్మాణం, సిబ్బంది నియామకం తదితర వాటిపై సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం ఉన్న నేపథ్యంలో వీరి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.