Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Jagan: ఆ ఒక్కమాటతో జగన్ సహా వైసీపీ నేతల అభిమానాన్ని చూరగొన్న పవన్

Pawan Kalyan- Jagan: ఆ ఒక్కమాటతో జగన్ సహా వైసీపీ నేతల అభిమానాన్ని చూరగొన్న పవన్

Pawan Kalyan- Jagan
Pawan Kalyan- Jagan

Pawan Kalyan- Jagan: పవన్ ఒక వ్యసనం.. ఒక పిచ్చి..ఒక వ్యామోహం.. ఒక పవర్.. ఒక సమ్మోహన శక్తి. పవన్ ను అభిమానులు వర్ణించే తీరిది. అయితే పవన్ వ్యక్తిత్వం తెలుసుకున్న తటస్థులు సైతం ఇదే అభిప్రాయానికి వస్తారు. కానీ ఈ జాబితాలో వైసీపీ శ్రేణులు సైతం చేరుతుండడం విశేషం. పవన్ మంచి మనసును అర్ధం చేసుకొని మనసున్న నేతగా అభివర్ణిస్తూ తాము మారినట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం. పేరుకే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం. కానీ అధికార పార్టీ మాత్రం జనసేననే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తుంది. పవన్ పైనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తోంది. గ్రామస్థాయి నాయకుడి నుంచి మంత్రి వరకూ.. చివరకు సీఎం జగన్ సైతం ఏ వేదిక అయినా పవన్ పైనే విమర్శలు చేస్తుంటారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. వైసీపీ శ్రేణులు సైతం పవన్ ను రాజకీయ శత్రువు, ప్రత్యర్థిగా కంటే అంతకు మించి వ్యతిరేక భావనతో చూస్తారు. కానీ వారు ఇప్పుడు పవన్ ను అభిమానించడం, గౌరవించడం హాట్ టాపిక్ గా మారింది.

విశాఖ వేదికగా జగన్ సర్కారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయంగా ఏపీలో పెట్టుబడులను ఆహ్వానించే క్రమంలో సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు 26 దేశాల నుంచి 8 వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ‘దేశ విదేశాల నుంచి సాగరనగరానికి విచ్చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు జనసేన సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఏపీ యువత మిమ్నల్ని మెప్పిస్తారని ఆశిస్తున్నాం. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో ఏపీకి మంచి భవిష్యత్ చేకూరుతుందని భావిస్తున్నాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఇన్వెస్టర్స్ కు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆకాంక్షిస్తున్నా’ అంటూ పవన్ ట్విట్ చేశారు.

Pawan Kalyan- Jagan
Pawan Kalyan- Jagan

అటు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు పవన్. ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి’ అని పవన్ విన్నవించారు. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వంపై జనసేన ఎటువంటి విమర్శలు చేయదని కూడా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ సమ్మిట్ విషయంలో సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై వైసీపీ శ్రేణులు తెగ ఖుషీ అవుతున్నారు. మీ హుందాతనానికి అభినందనలు అంటూ సోషల్ మీడియాలో రిప్లయ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడివే హైలెట్ అవుతున్నాయి. ఒక్క జగన్ తప్పించి అన్నట్టు వైసీపీ శ్రేణుల పొగడ్తల వర్షం నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular