YCP To Janasena : ఎప్పుడైనా ప్రతిపక్షంలోంచి అధికార పార్టీలోక వెళదామని అనుకుంటారు. ఎప్పుడైతే అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి నేతలు రావాలని అనుకుంటున్నారో.. ఇక ఆ పార్టీ వచ్చేసారి ఓడిపోతున్నట్టే లెక్క. అధికారంలో ఉన్న వారు కూడా ఆ పార్టీని వద్దు అనుకొని వచ్చేస్తున్నారంటే ఇక జనాలే వచ్చేసారి ఓడించబోతున్నట్టు. ఇప్పుడు ఇదే పరిస్థితిని వైసీపీ ఎదుర్కొనబోతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
అధికార వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇదే వైసీపీ పతనానికి నాంది అని జనసైనికులు చెబుతున్నారు. వచ్చేసారి వైసీపీని వీడి చాలా మంది వస్తారని.. ఆ పార్టీ ఓటమికి ఇదే కారణమవుతుందని అంటున్నారు. పార్టీపై ప్రజల్లో, నేతల్లో నమ్మకం పోయిందనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు.
తాజాగా.. జనసేన పార్టీలో వైసీపీ నాయకుడు చేరారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలానికి చెందిన వైసీపీ నాయకులు వుయ్యురు శివ రామిరెడ్డి జనసేన పార్టీలో చేరారు. సోమవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆయన్ను పవన్ కళ్యాణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
1987 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న శ్రీ శివ రామిరెడ్డి… తెలుగుదేశం పార్టీ హయంలో మూడేళ్లు మండల అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. తదుపరి ప్రజారాజ్యంలో చేరి… గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 2012 నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు.