Site icon OkTelugu

AP Volunteer : టీడీపీ వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారా?

AP Volunteer  : వలంటీర్లు ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు తేనెతుట్టెను కదిలించింది. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా తొలగిస్తామన్న సంకేతాలను జనసేన, టీడీపీ పార్టీలు ఇస్తున్నాయి. మొన్న ‘వలంటీర్లు బ్రోకర్లు’ అంటూ పవన్ కళ్యాణ్ నిందించగా, నేడు చంద్రబాబు కూడా ఆయనకు గొంతు కలిపినట్లుగా కనిపిస్తుంది.  టీడీపీ అనుకూల మీడియాలోనూ ఈ రోజు వలంటీర్ల అరాచకాలపై కథనాలు ప్రచురించారు. ఇందులో భార్య భర్తల గొడవలు వలంటీర్లకే కావాలా? అన్న కోణంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రస్తుతం ఇది కూడా రచ్చవుతోంది.

జనసేన, టీడీపీలు పొత్తు పవనాలు వీస్తున్న వేళ పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు మాట్లాడడం వీరి పొత్తు ఖాయమని అనుకుంటున్నారు గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ గురించి గొప్పగా మాట్లాడిన వారే. చంద్రబాబు వలంటీర్ల కష్టాన్ని దగ్గరి నుంచి చూశానని వారు చాలా కష్టాల్లో ఉన్నారని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే వారిని కడుపులో పెట్టి చేసుకుంటామని కూడా చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆరోపణలతో చంద్రబాబు, ఎల్లో మీడియా కూడా స్టాండ్ మార్చేశారు.

వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. ఇది వైసీపీ ప్రభుత్వానికి గెలిపించడానికే జగన్ పెట్టిన సెటప్ అని చంద్రబాబు, పవన్ ఆరోపిస్తున్నారు. అక్కడ కూడా జగన్ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రచారం చేసేందుకు వలంటీర్ వ్యవస్థ ఉందని.. కేవలం ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామని, అది జగన్ ప్రభుత్వమే కాదు మేలు చేయడానికే. అందుకే టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఈ వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version