Pakistan Military rule : పాకిస్తాన్ తిరిగి మిలటరీ పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం బలపడే సూచనలు మచ్చుకైనా లేవు. ఈరోజుకి మిలటరీయే ప్రధాన చోదకశక్తిగా ఉంటూ వస్తోంది. వారికి నచ్చినవారే ప్రధానులుగా ఉంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్ ది దివాళా తీసిందని అంటున్నారు. 33 బిలియన్ డాలర్లు చెల్లించడానికి పాకిస్తాన్ వద్ద డబ్బు లేవు. 43శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. ఏదీ కొనలేని పరిస్థితులున్నాయి. 262 రూపాయలు ఒక డాలర్ కి చేరింది. పెట్రోల్ రేట్ 300 రూపాయలకు కాబోతోంది.
ఇవ్వాళా ఆర్థికంగా పాకిస్తాన్ దివాళా తీసింది. పాకిస్తాన్ లోని ఎంఎన్సీ కంపెనీలన్నీ ఆర్థికభారంతో లాక్ డౌన్ ప్రకటించాయి. తాత్కాలిక వారం మూసేశాయి. పరిస్థితులు దిగజారుతున్నాయి.
పాకిస్తాన్ తిరిగి మిలటరీ పాలనలోకి వెళ్ళబోతుందా? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.