తొలి వాక్సిన్ భారత్ నుంచే రానుందా?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏడాది ప్రారంభం నుంచే ప్రజలంతా కరోనా మహమ్మరితో పోరాడుతున్నారు. ఈ వైరస్ దాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతోన్నారు. అందమైన ఇటలీ దేశంలో కరోనా మరణమృదంగాన్ని తలపించింది. ఎక్కడ చూసిన శవాలదిబ్బలే కన్పించాయి. దీంతో అక్కడి ప్రజలంతా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మానవళికి సోషల్ మీడియాలో సందేశాన్నిచ్చారు. నాటి నుంచి ప్రజలు కరోనా పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. అలాగే కరోనాపై […]

Written By: Neelambaram, Updated On : July 6, 2020 1:22 pm
Follow us on


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఏడాది ప్రారంభం నుంచే ప్రజలంతా కరోనా మహమ్మరితో పోరాడుతున్నారు. ఈ వైరస్ దాటికి అగ్రరాజ్యాలు సైతం కకావికలం అవుతోన్నారు. అందమైన ఇటలీ దేశంలో కరోనా మరణమృదంగాన్ని తలపించింది. ఎక్కడ చూసిన శవాలదిబ్బలే కన్పించాయి. దీంతో అక్కడి ప్రజలంతా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మానవళికి సోషల్ మీడియాలో సందేశాన్నిచ్చారు. నాటి నుంచి ప్రజలు కరోనా పేరు చెబితే భయాందోళనకు గురవుతున్నారు. అలాగే కరోనాపై అవగాహన పెంచుకుంటూ అనవసరంగా రోడ్లపైకి రావడం తగ్గించారు.

బాబుని చిత్తుచేసే జగన్ మరో ఎత్తు..!

ఆయా దేశాలు లాక్డౌన్ పాటించడం, కరోనాపై అవగాహన కల్పిస్తుండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నారు. అయితే తొలినాళ్లలో నమోదైన మరణాలతో పొలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. అయితే కేసుల సంఖ్య తగ్గడం లేదు. కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు. అయితే కరోనా ఊసరవెల్లిగా రంగులు మారుస్తుండటంతో దీనికి వ్యాక్సిన్ కనుగోనడం కొంచెం కష్టంగా మారింది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా శాస్త్రవేత్తలు నిరంతరంగా వాక్సిన్ తయారీ కోసం పని చేస్తున్నారు.

ఇప్పటికే పలుదేశాలు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్నాయి. పలు బయోటెక్ కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ తయారీ ఛాలెంజ్ గా తీసుకొని పని చేస్తున్నారు. దీని తయారీకి ఇంకో ఏడాది సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు చెబుతోన్నాయి. అయితే ఇప్పటికే భారత్ చెందిన బయోటెక్ కంపెనీలు కరోనా డ్రగ్, ఇంజక్షన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్లేన్ మార్క్ సంస్థ తయారు చేసిన కరోనా మెడిసిన్ ను ఐసీఎంఎఆర్ అనుమతి ఇచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఈ మందులను వాడాలని సూచించింది. ఒక్కో ట్లాబెట్ ధర రూ.103గా నిర్ధారించింది. అయితే సాధారణ కరోనా లక్షణాలు ఉన్నవారికే పని చేస్తుందని తెలిపింది. పూర్తిస్థాయి కరోనా రోగులకు ఇది పని చేయదని పేర్కొంది.

వైరస్ ల ఖార్ఖానాగా చైనా ఎందుకు మారుతుంది?

మరోవైపు హెటిరో కంపెనీ కూడా కరోనాకు ఇంజెక్షన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఇంజక్షన్ ధర రూ.5వేలు ఉంటుందని తెలుస్తోంది. కరోనా డ్రగ్, ఇంజక్షన్లు మార్కెట్లోకి వచ్చినా వ్యాక్సిన్ కోసం భారత్ ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఆగస్టు 15 టార్గెట్ గా పెట్టుకొని కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని భారత్ బయోటెక్ కంపెనీలు పని చేస్తున్నాయి. ఒకేసారి జంతువులు, మానవులు ట్రయల్ నిర్వహిస్తూ వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేశాయి. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందనే ఆశాభావాన్ని ఐసీఎంఆర్ లాంటి సంస్థలు చెబుతున్నారు.

భారత్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కరోనా వ్యాక్సిన్ ప్రపంచానికి అందించాలని చూస్తోంది. దీనికోసం భారత సైంటిస్టులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. వీరి కృషి ఫలిస్తే ఆగస్టు 15న భారత్ తోపాటు ప్రపంచమంతా శుభవార్త వినడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే కరోనా డ్రగ్, ఇంజక్షన్ ను భారతే ముందుగా తీసుకొచ్చింది. దీంతో భారత్ నుంచే కరోనాకు తొలి వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో ప్రపంచ దేశాలు మనవైపు చూస్తున్నాయి. దీనికి అనుగుణంగా మన సైంటిస్టులు పని చేస్తున్నారు. ఈ ఛాలెంజ్లో మన సైంటిస్టులు నెగ్గి.. ప్రపంచం నుంచి కరోనా మహ్మమరిని తరలికొట్టాలని మనసారా కోరుకుందాం..