వైఎస్సార్ ను టీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది?

తెలంగాణ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు మాటలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు కొనసాగుతున్న వేళ సీమాంధ్రులు అనే పదునైన పదజాలంతో దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలపై సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో అప్పుడే రాజకీయ వేడి రాజుకుందని తెలుస్తోంది. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు ప్రాంతాల […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 2:50 pm
Follow us on

తెలంగాణ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు మాటలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు కొనసాగుతున్న వేళ సీమాంధ్రులు అనే పదునైన పదజాలంతో దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతున్నాయి. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలపై సైతం విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో అప్పుడే రాజకీయ వేడి రాజుకుందని తెలుస్తోంది.

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు ప్రాంతాల మధ్య వివాదం రాజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందంటూ తెలంగాణ వాదిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ అంటోంది. నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని రెండు ప్రాంతాలు పట్టుబడుతున్నాయి.

తెలంగాణ మంత్రులు ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణం అక్రమంగా చేపడుతుందంటూ ఏపీపై ఆరోపణలు చేస్తోంది. వైఎస్సార్ దొంగ అయితే జగన్ గజదొంగ అని విమర్శిస్తున్నారు. వైఎష్ఆర్ నరరూప రాక్షసుడంటూ మండిపడుతున్నారు. తమ వాటా కోసం ఏపీతో నైనా అవసరమైతే దేవుడితోనైనా పోరాటం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల చేసిన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రభావం తెలంగాణలో ఉండదని చెప్పారు. తెలంగాణను అవమాన పరిచింది వైఎస్సారే అని విమర్శించారు. వైఎస్ వారసులకు తెలంగాణలో స్థానం లేదని తేల్చేశారు. వైఎస్ వారసులమంటూ వస్తున్న వారిని నమ్మొద్దని సూచించారు. వైఎస్ బతికుంటే తెలంగాణ వచ్చేది కాదని స్పష్టం చేశారు.

వైఎస్సార్ ను విమర్శిస్తూ ప్రయోజనం పొందాలని చూస్తున్న తెలంగాణ నేతలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాలు పెద్దదిగా చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే లేనిపోని రాద్దాంతాలు సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.