వాలంటీర్లపై వేధింపులు ఎందుకు: బాబు

ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికి అని చెప్పి వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం వాలంటీర్లను వైసీపీ, ఆ పార్టీ నాయకులు కోసం నియమించిందా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజాధనంతో వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ‘కరోనా’ ప్రత్యేక సాయం కింద ఇచ్చే రూ.1000 రూపాయలను వైసీపీ నాయకులు అందజేయడమేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ శనివారం ట్విట్ చేశారు. సాయం పంపిణీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటవినని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 5:27 pm
Follow us on


ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడానికి అని చెప్పి వాలంటీర్లను నియమించిన ప్రభుత్వం వాలంటీర్లను వైసీపీ, ఆ పార్టీ నాయకులు కోసం నియమించిందా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజాధనంతో వాలంటీర్లకు జీతాలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ‘కరోనా’ ప్రత్యేక సాయం కింద ఇచ్చే రూ.1000 రూపాయలను వైసీపీ నాయకులు అందజేయడమేమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ శనివారం ట్విట్ చేశారు.

సాయం పంపిణీ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటవినని వాలంటీర్లను విధుల్లోంచి తొలగించడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. వాళ్ళున్నది ప్రజల కోసమా? పార్టీకోసమా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, గెడ్డతిరువాడకు చెందిన బొంగు కార్తీక్, గోపిశెట్టి ఝాన్సీలను వైసీపీ నేతల మాట వినలేదని విధుల్లోంచి తొలగించారని తెలిపారు. ఇటువంటి చర్యలు తగవన్నారు.
గ్రామ వాలంటీరు గోపిశెట్టి ఝాన్సీ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వాలంటీర్లపై ఇటువంటి వేధింపులు ఎందుకన్నారు. ప్రజల డబ్బుతో వాలంటీర్లను పెట్టుకుంది వైసీపీ నాయకులకు వంగి వంగి దండాలు పెట్టడానికా అని ప్రశ్నించారు.