https://oktelugu.com/

KCR, Telangana Education System: తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు కారణమేంటి?

KCR, Telangana Education System:  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అంటే అందరికీ అభిమానమే.. తెలంగాణ వస్తే ఎన్నో మంచి పనులు జరుగుతాయని అనుకున్నాం.. కానీ కేసీఆర్ తెలంగాణ వచ్చాక.. రాజకీయాలపై దృష్టిపెట్టారు.. ఓట్ల కోసమే పనిచేస్తున్నారు.. అతి ప్రధానమైన విద్య, వైద్యంపై అస్సలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు ప్రతీ సంవత్సరం 12 వేల కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నారు.. ప్రతీ ప్రభుత్వ విద్యార్థిపై ఏడాదికి 45వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.. […]

Written By:
  • NARESH
  • , Updated On : May 31, 2022 / 10:43 AM IST
    Follow us on

    KCR, Telangana Education System:  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేపట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అంటే అందరికీ అభిమానమే.. తెలంగాణ వస్తే ఎన్నో మంచి పనులు జరుగుతాయని అనుకున్నాం.. కానీ కేసీఆర్ తెలంగాణ వచ్చాక.. రాజకీయాలపై దృష్టిపెట్టారు.. ఓట్ల కోసమే పనిచేస్తున్నారు.. అతి ప్రధానమైన విద్య, వైద్యంపై అస్సలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ప్రభుత్వ టీచర్లకు ప్రతీ సంవత్సరం 12 వేల కోట్ల రూపాయల జీతాలు ఇస్తున్నారు.. ప్రతీ ప్రభుత్వ విద్యార్థిపై ఏడాదికి 45వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారు.. కానీ వీరి రిజల్ట్ చూస్తే 63 శాతం సీ గ్రేడ్ నమోదవుతోంది.. అదే ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు జీతాల రూపంలో 7 వేల కోట్లు ఇస్తున్నారు. కానీ ఈ పాఠశాలల్లో 90 శాతం ఏ గ్రేడ్ తీసుకొస్తారు.. మరి ఇక్కడ ఎందుకు రావడం లేదు..? తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నది అసలు ప్రశ్న.. ఈ రహస్యాన్ని విడమరిచి చెప్పారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఆయన చేసిన సంచలన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అవే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

    ‘తెలంగాణలోని కలెక్టర్లకు ముఖ్యమంత్రి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తానేం చెబితే అదే చేయాలి. కొత్త ప్రయోగాలు ఏం చేయొద్దు.. ఈ మెసేజ్ నేను కూడా తీసుకున్నా.. విద్య, వైద్యం, ట్రైబల్ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టొద్దని అన్నారు. ఇలాంటి సమయంలో టీచర్లకు కూడా ఇదే మెసేజ్ వర్తిస్తుంది. ఇక వారు ఎలా పనిచేస్తారు..? లక్షల రూపాయల్లో జీతాలు తీసుకుంటున్నారు.. కానీ ఆ డబ్బుతో చాలా మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. పిల్లల చదువులను పట్టించుకోవడం లేదు. సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ విద్యపై వివక్ష చూపాలని కుట్ర పన్నుతున్నారు. అందుకే ఇలాంటి మెసేజ్ లు పంపిస్తున్నారు. పేద పిల్లలు ఎదిగితే కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతారని కావచ్చు.. అందుకే విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ’ అని కేసీఆర్ సర్కార్ లో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ మురళీ చేసిన కామెంట్స్ పెను సంచలనమయ్యాయి. కేసీఆర్ లూప్ హోల్స్ అన్నీ ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పంచుకోవడం దుమారం రేపింది.

    Also Read: RRR Making Video: ‘ఆర్ఆర్ఆర్’లోని బ్రిడ్జి సీన్ అద్భుతహా.. ఎలా చేశారో చూడండి

    ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలను పునర్విభజన చేశారు. ఇందులో భాగంగా 33 జిల్లాలు రూపాంతరం చెందాయి. అయితే ఇప్పటికీ 26 జిల్లాల్లో డీఈవో లు లేరు. డీఈవోలు లేనప్పుడు కింది స్థాయి అధికారులు ఎలా పనిచేస్తారు. 570 మండలాలున్న రాష్ట్రంలో 530ల్లో మండల విద్యాధికారులు లేరు. సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. అసలు విద్యా వ్యవస్థపై 5 నిమిషాలపై మీటింగ్ ఎప్పుడైనా పెట్టారా..? ఈ మధ్య కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ‘మన ఊరు… మనబడి’ అని ప్రొగ్రాం పెట్టారు.. ఇది కూడా విరాళాలతో నిర్వహించాలని చూస్తున్నారు. ఇంత పెద్ద విద్యా వ్యవస్థకు బడ్జెట్ లో ఒక్కరూపాయయైనా కేటాయించారా..?’ అంటూ తెలంగాణ విద్యావ్యవస్థ తీరుతెన్నులను ఆకునూరి మురళీ కడిగిపారేశారు.

    ‘మళ్లీ ప్రభుత్వం ఏర్పడినా కేసీఆర్ చెప్పిందే చేయాలంటారు.. ఓట్ల కోసమే ఆలోచిస్తున్న కేసీఆర్ విద్యావ్యస్థను పట్టించుకోవడం లేదు. ఢిల్లీ సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఆయన మళ్లీ గెలవలేదా..? అలాగే ఈ రెండు వ్యవస్థలను డెవలప్ చేయండి.. పిల్లలు ఓట్లేయ్యరు కావచ్చు.. కానీ వారి తల్లిదండ్రులు ఓట్లేస్తారు కదా.. ఇలా కొన్ని వర్గాలను ఎదగనీయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. వారిని కొన్ని ప్రభుత్వ పథకాల పేరిట అక్కడే ఆపేస్తున్నారు. విద్యపై ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ’ అని కేసీఆర్ విద్యావ్యవస్థను ఎందుకు పట్టించుకోవడం లేదో అసలు రహస్యాన్ని ఆకునూరి మురళి బయటపెట్టి సంచలనం రేపారు.

    Also Read: Rajya Sabha-Telangana: తెలంగాణ నుంచి రాజ్యసభ వెళ్లే వారెవరో?

    ఒకటి కాదు.. రెండు కాదు.. కేసీఆర్ చేసే ప్రతి పనిలో స్వార్థం, రాజకీయం.. ఓట్లకోసమే చేస్తాడని ఆకునూరి మురళి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సీఎంవోలో కీలక పదవులు, విద్యావైద్యం పట్టించుకోకపోవడం వెనుక అసలు నిజాలను ఆకునూరి మురళీ బయటపెట్టారు. కేసీఆర్ ను పూర్తిగా చదివినట్టే ఆయన వ్యాఖ్యలున్నాయి. అవిప్పుడు తెలంగాణ సమాజంలో అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి.