ఇంతకీ తెలంగాణలో జనసేన అధినేత ఎటువైపు..?

దుబ్బాక ఎన్నిక తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. బీజేపీలోని ప్రతీ కార్యకర్త కలిసికట్టుగా పనిచేయడంతో దుబ్బాకలో బీజేపీ స్టాండ్ నిలబడిందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంతోనే విజయం సాధ్యమైందంటూ పొగిడారు. దీంతో ఒకప్పుడు కేసీఆర్ కు మద్దతుగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ బీజేపీకి సపోర్టు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురయ్యారు. బీజేపీ నాయకులు సైతం పవన్ ప్రకటనపై కృతజ్ఞతలు తెలుపడంతో పవన్ తెలంగాణలో బీజేపీ వైపే అన్నట్లు […]

Written By: NARESH, Updated On : November 15, 2020 11:46 am
Follow us on

దుబ్బాక ఎన్నిక తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీపై ప్రశంసలు కురిపించారు. బీజేపీలోని ప్రతీ కార్యకర్త కలిసికట్టుగా పనిచేయడంతో దుబ్బాకలో బీజేపీ స్టాండ్ నిలబడిందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంతోనే విజయం సాధ్యమైందంటూ పొగిడారు. దీంతో ఒకప్పుడు కేసీఆర్ కు మద్దతుగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ బీజేపీకి సపోర్టు ఇవ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురయ్యారు. బీజేపీ నాయకులు సైతం పవన్ ప్రకటనపై కృతజ్ఞతలు తెలుపడంతో పవన్ తెలంగాణలో బీజేపీ వైపే అన్నట్లు అర్థమైంది.

Also Read: గ్రేటర్ నజర్: కేసీఆర్ అలెర్ట్.. భారీగా పోలీసుల బదిలీలు

దీపావళి సందర్భంగా తెలంగాణలో బాణసంచా కాల్చుడు, అమ్మకాలపై హైకోర్టు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ బాణసంచా పై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో గట్టిగా వాదించకపోవడంతోనే హైకోర్టు నిషేధించిందని విమర్శించారు. ప్రతీ సారి హిందూ పండుగలపై కేసీఆర్ వ్యతిరేక ధోరణిగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పండుగలపై నిషేధం విధించడం కేసీఆర్ కు ఫ్యాషన్ గా మారిందన్నారు. అయితే ఆ తరువాత తెలంగాణ ఫైర్ కాకర్ష్ అసోసియేషన్ సుప్రీం కోర్టు వెళ్లడంతో రెండు గంటలపాటు టపాసులు కాల్చడానికి అనుమతించిన విషయం తెలిసిందే.

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బాణసంచా కాల్చడం వల్ల గాలిలో కాలుష్యం తీవ్రంగా ఏర్పడి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. సంప్రదాయంగా దీపాలు పెట్టి, లక్ష్మీ పూజలతో సంబరాలు చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ఇంకా తొలిగిపోనందున బాణసంచాకు దూరంగా ఉండడమే మేలన్నారు.

Also Read: ‘గ్రేటర్’ విజయం కోసం టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయనుకున్న సందర్భంగా ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇవ్వడంతో ఇంతకీ పవన్ కల్యాణ్ ఎటువైపు ఉన్నట్లు..? అని చర్చించుకుంటున్నారు. దుబ్బాక ఎన్నికపై కేవలం బండి సంజయ్ ను ఉద్దేశించి ఎక్కువగా పొగిడిన పవన్ కల్యాణ్ బాణసంచాపై బండి సంజయ్ కి విరుద్ధంగా చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్